కరోనా మహమ్మారి తొలగిపోయి ప్రజలంతా సంతోషంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆకాంక్షించారు. ఆధివారం.. బల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవార్లను కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వాదాలను స్వీకరించారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని, ప్రజలంతా సుఖంగా ఉండాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. మంత్రి వెంట సికింద్రాబాద్ పార్లమెంట్ తెరాస బాధ్యుడు తలసాని సాయికిరణ్, అలయ ఈవోలు, ఇతర అధికారులు ఉన్నారు.
ఇవీచూడండి: ఈమె ఆన్‌లైన్ బడిలో లక్షల మంది విద్యార్థులు