తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని పశుసంవర్ధక, మత్స్య సహకార శాఖామాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తొలివిడత గొర్రెల పంపిణీ విజయవంతమైందని, రెండో దఫాకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఇప్పటికీ డీడీలు చెల్లించిన వారికి జూన్లో అందించనున్నట్లు తెలిపారు.
విజయ డైరీ ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి వెల్లడించారు. డైరీలో సభ్యత్వం ఉండి పాలు పోయని వారి సభ్యత్వం రద్దు చేస్తామని హెచ్చరించారు. కొత్త సభ్యులను చేర్చుకుంటామని స్పష్టం చేశారు. పాడి రైతులకు లీటర్కు రూ.4 చొప్పున ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు వివరించారు. మత్య్సకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు.
ఇదీ చూడండి: కరోనాపై కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీ భేటీ