పేద, మధ్యతరగతి ప్రజలు కరోనా నుంచి వరదల వరకు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 10వేల రూపాయలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో వరద బాధితులకు రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. గోషామహల్ నియోజకవర్గం గన్‌ఫౌండ్రి డివిజన్లోని చౌదరి బస్తీలో ప్రతి ఇంటికీ తిరిగి నగదును ఇచ్చారు.
ప్రతిపక్షాలవి అనవసర రాద్దాంతాలని విమర్శించారు. ఇంత పెద్ద విపత్తు సంభవిస్తే కేంద్రం నుంచి విపత్తు సహాయం రాకపోవడం బాధాకరమన్నారు. వరద బాధితులందరికి అధికారులు ఇంటింటికి వచ్చి 10వేలు అందిస్తారని.. దళారుల మాటలు నమ్మి మోసపోవొద్దని మంత్రి సూచించారు.
ఇదీ చూడండి: ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు పెంపు పిటిషన్‌పై విచారణ