కేసీఆర్ మాట ఇస్తే తప్పకుండా నెరవేరుస్తారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పేదలపై భారం పడొద్దనే ఉద్దేశంతో రాష్ట్ర సర్కారు ఉచితంగా తాగునీరు సరఫరా చేస్తోందని ఆయన వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఉచిత తాగునీటి పథకాన్ని రహమత్‌నగర్‌లో మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించగా... ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని, మల్లారెడ్డి, మహమూద్ అలీలు పాల్గొన్నారు.
హామీలు ఇచ్చింది, అమలు చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని మంత్రి తలసాని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలకు ధైర్యం ఉంటే అభివృద్ధి చేసి చూపాలని సవాల్ విసిరారు. అన్ని కులాలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి చెప్పారు.
ఇదీ చదవండి: గ్రేటర్లో ఉచిత తాగునీటి పథకాన్ని ప్రారంభించిన కేటీఆర్