దేశంలో ఆరు రాష్ట్రాల్లో కోళ్లలో బర్డ్‌ఫ్లూ నిర్ధారణైన నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నామని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. రాష్ట్రంలో అసలు ఎలాంటి బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు లేవని, వచ్చే అవకాశాలు కూడా లేవని తెలిపారు. ఒకవేళ వచ్చినా సరే సమర్థవంతంగా ఎదుర్కోవడానికి పూర్తి సంసిద్ధంగా ఉన్నామని, ఇప్పటికే 100 సంచార పశువైద్యశాలలు, 1300 బృందాలు గ్రామాల్లో తిరిగి కోళ్ల పెంపకందారులు, వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నాయని మంత్రి చెప్పారు.
సంగారెడ్డి జిల్లాలో చనిపోయిన కోళ్లను పరిశీలించగా... అవి మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల వాతావరణం పడక అవి మరణించాయని... బర్డ్‌ఫ్లూతో కాదని స్పష్టం చేశారు. బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో త్వరలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ నిర్వహించి కూలంకుషంగా చర్చిస్తామని మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మొదటి కరోనా వ్యాక్సిన్ నేనే తీసుకుంటా: మంత్రి ఈటల