ETV Bharat / city

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి తలసాని

హైదరాబాద్​ సనత్​నగర్ నియోజకవర్గంలోని అమీర్​పేట, సనత్​నగర్ డివిజన్లలో సుమారు రూ.కోటిన్నరతో పలు అభివృద్ధి పనులను మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ ప్రారంభించారు. అమీర్​పేట కార్పొరేటర్ శేష కుమారి, సనత్​నగర్ కార్పొరేటర్ లక్ష్మీ బాల్​రెడ్డి ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి పనులను మంత్రి మొదలుపెట్టారు.

author img

By

Published : Oct 9, 2020, 3:39 PM IST

minister talasani srinivas yadav integrated development works

పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అందించటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్​ సనత్​నగర్ నియోజకవర్గంలోని అమీర్​పేట, సనత్​నగర్ డివిజన్లలో సుమారు రూ.కోటిన్నరతో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. అమీర్​పేట కార్పొరేటర్ శేష కుమారి, సనత్​నగర్ కార్పొరేటర్ లక్ష్మీ బాల్​రెడ్డి ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి పనులను మంత్రి మొదలుపెట్టారు.

గత ప్రభుత్వంలో చేయని అభివృద్ధి పనులకు తన హయాంలో శ్రీకారం చుట్టినట్లు మంత్రి తెలిపారు. ఎన్నో ఏళ్లుగా వెనుకబడిన ప్రాంతాలను సైతం అభివృద్ధి బాటలో ముందుకు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, తెరాస కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇదీ చూడండి: నాలెడ్జ్​ అప్​గ్రేడ్​​తో ఉద్యోగ భద్రత: జయేశ్ రంజన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.