సమాజ సేవకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెరాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళ్రావు నగర్ డివిజన్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలన్నారు.
కరోనా వైరస్ నిర్మూలనకు ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. కరోనా కట్టడికి ఎమ్మెల్యే గోపీనాథ్ చేపట్టిన చర్యలను అభినందించారు. నియోజకవర్గం పరిధిలోని వలస కూలీల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు ఎమ్మెల్యే తెలిపారు. రక్తదాతలకు పండ్లు అందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దేదీప్యా, నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీకి గ్రీన్ సిగ్నల్