ETV Bharat / city

HC on Ganesh Immersion: హౌజ్​మోషన్​కు అనుమతి నిరాకరణ.. నేడు లంచ్ మోషన్​లో విచారణ! - Ganesh Immersion in tankbund

minister-talasani-srinivas-review-petition-on-high-court-ganesh-emersion-verdict

author img

By

Published : Sep 12, 2021, 1:03 PM IST

Updated : Sep 13, 2021, 2:14 AM IST

13:01 September 12

నిమజ్జనం తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసేందుకు ప్రభుత్వ నిర్ణయం

వినాయక నిమజ్జనంపై తీర్పుపై ఇవాళ న్యాయమూర్తి ఇంట్లో అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది. హౌజ్​మోషన్ పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును ప్రభుత్వం కోరింది. హౌజ్​మోషన్​కు అనుమతి నిరాకరించిన హైకోర్టు.. ఇవాళ ఉదయం ప్రస్తావిస్తే లంచ్ మోషన్ విచారణకు పరిశీలిస్తామని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. 

గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ తెలిపారు.  ప్రభుత్వం తరఫున నేడు హౌజ్ మోషన్ పిటిషన్ వేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. హైదరాబాద్​లో గణేశుల నిమజ్జనం యథావిధిగా చేసుకునేలా హైకోర్టు అవకాశమివ్వాలని ధర్మాసనాన్ని కోరనున్నట్లు తెలిపారు. 

పెద్ద మనసుతో అర్ధం చేసుకోవాలి...

"వినాయక చవితికి ఒక రోజు ముందు హైకోర్టు తీర్పునిచ్చింది. తీర్పు వచ్చేటప్పటికే విగ్రహాలు మండపాలకు చేరాయి. ఇప్పటికిప్పుడు ప్రత్యామ్మాయ ఏర్పాట్లు చేయటం అసాధ్యం. హైదరాబాద్‌లో కుంటల ఏర్పాటు ఇబ్బందితో కూడుకున్న విషయం. క్షేత్రస్థాయి పరిస్థితిని హైకోర్టు అర్థం చేసుకోవాలి. భవిష్యత్‌లో కోర్టు ముందస్తు ఆదేశాలు ఇస్తే ఏర్పాట్లు చేసుకుంటాం. ధర్మాసనం పెద్దమనసు చేసుకోవాలని.. పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానిది. నిమజ్జనం అయిన 48 గంటల్లో వ్యర్థాలు తీసివేస్తాం." - తలసాని శ్రీనివాస్​ యాదవ్​, మంత్రి

సంబంధింత కథనాలు..

Last Updated : Sep 13, 2021, 2:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.