గాంధీ ఆస్పత్రిలో డాక్టర్లపై జరిగిన దాడిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ గాంధీ ఆస్పత్రిని సందర్శించిన మంత్రి.. వైద్యులతో మాట్లాడారు. మరింత భద్రత కల్పిస్తామని వారికి హామీ ఇచ్చారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది ప్రాణాలు పణంగా పెట్టి సేవలు అందిస్తున్నారని కొనియాడారు. గాంధీ ఆస్పత్రి వద్ద ప్రత్యేక పికిట్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో ఉండే యాచకులను వేరే ప్రాంతానికి తరలిస్తామన్నారు. తెలంగాణ నుంచి మర్కజ్కి వెళ్లిన వారిని దాదాపుగా గుర్తించామన్నారు. ఇంకా ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఇవీచూడండి: కుమారుడు ఎదుటే తండ్రిని కొట్టిన కానిస్టేబుల్.. కేటీఆర్ ట్వీట్