జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస వందకు పైగా సీట్లు గెలవడం ఖాయమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధీమావ్యక్తం చేశారు. హైదరాబాద్ పరిధిలోని అడిక్‌మెట్ డివిజన్లోని నాగమయ్య కుంట, మేడి బాయ్ బస్తీల్లో ఆయన తెరాస అభ్యర్థి జయరామిరెడ్డి తరఫున ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. అన్ని డివిజన్లలో తెరాసకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని శ్రీనివాసగౌడ్ తెలిపారు.
పోలింగ్ తేదీ వరకు బతికి ఉంటే తప్పనిసరిగా కారు గుర్తుకే ఓటు వేస్తానని ఓ వృద్ధురాలు చెప్పడం తనను ఎంతో ఆనందానికి గురిచేసిందని ఆయన పేర్కొన్నారు.
ఇవీచూడండి: 'ఓటేయకుండా ప్రశ్నించే, విమర్శించే హక్కు ఏ పౌరునికి లేదు'