భారతదేశంలోనే అత్యంత అధునిక సౌకర్యాలతో నెక్లెస్‌రోడ్డులో నిర్మించ తలపెట్టిన నీరాకేఫ్ శంకుస్థాపన ఈ నెల 23న నిర్వహించనున్నట్లు రాష్ర్ట ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నీరా కేఫ్ శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి శుక్రవారం అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేవం నిర్వహించారు. మూడు కోట్లు వ్యయంతో నిర్మించే అధునిక నీరా కేఫ్ ప్రతిపాదిత నమూనాను మంత్రి పరిశీలించారు.
కులవృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. నీరా కేఫ్ శంకుస్థాపన కార్యక్రమానికి గౌడ సామాజిక వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల నాయకులను ఆహ్వానించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి గౌడ సోదరుడు కనీసం మూడు తాటి, ఈత మొక్కలను నాటాల్సిందిగా మంత్రి పిలుపునిచ్చారు.