ETV Bharat / city

59.16లక్షల మందికి రైతుబంధు ఇచ్చాం: నిరంజన్​ రెడ్డి - నిరంజన్​ రెడ్డి వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా 59.16 లక్షల మంది రైతులకు రైతుబంధు అందించామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. 26వ త్రైమాసిక రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు తెరాస ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో... మౌలిక సదుపాయాల కల్పన కోసం అధికంగా రుణాలు ఇవ్వాలని మంత్రి సూచించారు.

NIRANJAN REDDY
NIRANJAN REDDY
author img

By

Published : Jul 6, 2020, 5:14 PM IST

Updated : Jul 6, 2020, 6:35 PM IST

రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం రుణ ప్రణాళిక ఖరారైంది. 2020-21 వార్షిక సంవత్సరం 2020-21 వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం 1,61,620 కోట్లు రూపాయలుగా రూపకల్పన చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.1,46,238.44 కోట్ల రూపాయలు పంపిణీ చేసినట్లు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి పంపిణీ చేయబోయే రుణాలపై అదనంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ 10 శాతం పెంచినట్లు చెప్పారు. హైదరాబాద్ డాక్టర్ ఎంసీఆర్​హెచ్ఆర్డీలో జరిగిన 26వ త్రైమాసిక రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి-ఎస్ఎల్‌బీసీ సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అర్హులందరకీ రైతుబంధు ఇచ్చాం

ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం పంట రుణాల ప్రణాళిక, ప్రత్యేకించి వ్యవసాయ రుణాలు, రుణ మాఫీ, రైతుబంధు వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. కరోనా నేపథ్యంలో రైతులు, ఇతర ఖాతాదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ధైర్యంగా బ్యాంకర్లు పనిచేశారని మంత్రి కొనియాడారు. బ్యాంకు అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ఈ ఏడాది ప్రత్యేకించి వ్యవసాయ పంట రుణాలు 75,141.71 కోట్ల రూపాయలు పంపిణీ లక్ష్యంగా బ్యాంకులు పెట్టుకోవడం అభినందనీమని అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు 12,061.07 కోట్ల రూపాయలు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. ఈ ఏడాది వానా కాలం రైతుబంధు పథకం కింద అర్హులైన రైతులందరికీ పెట్టుబడి సాయం బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.

వాటికి ఎక్కువ రుణాలివ్వాలి

రాష్ట్రవ్యాప్తంగా 59.16 లక్షల మంది రైతులకు రైతుబంధు అందించామని ప్రకటించారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ దృష్ట్యా రుణమాఫీ పథకం అమలు వేగవంతం చేయడమే కాకుండా 25 వేల రూపాయల లోపు అప్పులు మాఫీ కోసం ఇప్పటి వరకు 417 కోట్ల రూపాయలు బ్యాంకు ఖాతాల్లో జమ చేసినందున కొత్త పంట రుణాల ప్రక్రియ వేగవంతం చేయాలని బ్యాంకర్లకు సూచించారు. కీలక వ్యవసాయం, అనుబంధ రంగాలకు కేసీఆర్ సర్కారు అధిక ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం అధికంగా రుణాలు ఇవ్వాలని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్బీసీ కన్వీనర్‌ ఓం ప్రకాష్ మిశ్రా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి రోనాల్డ్ రోస్, వ్యవసాయ శాఖ కమిషనర్ డాక్టర్ బి.జనార్ధనరెడ్డి, నాబార్డ్ సీజీఎం వైకే రావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 20-20-20 సీక్రెట్ గురించి మీకు తెలుసా?

Last Updated : Jul 6, 2020, 6:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.