ETV Bharat / city

గిరిజనులెవరూ ఆందోళన చెందవద్దు: మంత్రి సత్యవతి రాఠోడ్ - ఆస్తుల నమోదుపై మంత్రి సత్యవతి రాఠోడ్​

ఏజెన్సీ ప్రాంతాల్లో ఆస్తుల నమోదు విషయంలో గిరిజనులెవరూ ఆందోళన చెందవద్దని మంత్రి సత్యవతి రాఠోడ్​ తెలిపారు. సాదా బైనామాల వల్ల గిరిజనుల భూమికి ఎలాంటి నష్టం జరగదని మంత్రి హామీ ఇచ్చారు.

minister satyavathi rathod on sada bynamas
గిరిజనులెవరూ ఆందోళన చెందవద్దు: మంత్రి సత్యవతి రాఠోడ్
author img

By

Published : Oct 14, 2020, 8:41 PM IST

ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల నమోదు విషయంలో గిరిజనులెవరూ ఆందోళన చెందవద్దని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాఠోడ్​ హామీ ఇచ్చారు. కొందరు ప్రతిపక్ష నేతలు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తూ గిరిజనులను రెచ్చగొడుతున్నారని.. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని మంత్రి కోరారు.

ఆర్వోఎఫ్ఆర్​ పట్టాలున్న వారికి ప్రభుత్వ పథకాలు కొనసాగుతాయని మంత్రి తెలిపారు. సాదా బైనామాలు గతంలో అవకాశమిచ్చినప్పుడు కొంతమంది దీనిని వినియోగించుకోలేకపోయారని.. వారి విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్​ మరోసారి అవకాశం ఇచ్చారన్నారు. ఈ సాదా బైనామాల వల్ల గిరిజనుల భూమికి ఎలాంటి నష్టం జరగదని మంత్రి వివరించారు.

ఇవీ చూడండి: 'ముంపు బాధితుల కోసం సెంటర్​హోం ఏర్పాటు చేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.