ETV Bharat / city

విద్యాసంస్థలు తెరిచేలా మార్గదర్శకాలు రూపొందించాలి: సబిత

విద్యాసంస్థలు తెరిచేలా మార్గదర్శకాలు రూపొందించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఈ నెల 25 నాటికి విద్యాసంస్థల యాజమాన్యాలు తరగతుల వారీగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

విద్యాసంస్థలు తెరిచేలా మార్గదర్శకాలు రూపొందించాలి: సబిత
విద్యాసంస్థలు తెరిచేలా మార్గదర్శకాలు రూపొందించాలి: సబిత
author img

By

Published : Jan 12, 2021, 1:29 PM IST

విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు. కొవిడ్ జాగ్రత్తలతో విద్యాసంస్థలు తెరిచేలా మార్గదర్శకాలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు. విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నెల 25 నాటికి సిబ్బంది, అధికారులు సిద్ధం కావాలని మంత్రి సూచించారు. అదే విధంగా యాజమాన్యాలు కూడా సిద్ధం కావాలన్న సబిత... తరగతుల వారీగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని తెలిపారు.

ఈ నెల 20లోగా ప్రత్యేక కార్యాచరణ సమర్పించాలన్న మంత్రి... ఈ నెల 18న గురుకులాల నిర్వహణపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 19న ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో భేటీ ఉంటుందని ఆమె వివరించారు.

ఇదీ చదవండి: కేసీఆర్ మాట ఇస్తే తప్పకుండా నెరవేరుస్తారు: తలసాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.