లాక్డౌన్కు ప్రజలందరూ సహకరించాలని మంత్రి సబితా రెడ్డి కోరారు. బడంగ్పేట్ కార్పొరేషన్లో మంత్రి పర్యటించారు. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అత్యవసరమైతే మాత్రమే బయటకు రావాలని కోరారు.
ప్రతి డివిజన్, కాలనీల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పురపాలిక అధికారులకు సూచించారు. రోడ్లపై ఎవరూ తిరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం గాంధీనగర్ రేషన్ దుకాణంలో నిత్యవసర సరకులు, బియ్యం, గుడ్లు పంపిణీ చేశారు. నిత్యవసర వస్తువులను అధిక ధరలకు ఎవరూ విక్రయించినా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇవీచూడండి: 'లాక్డౌన్' ఉల్లంఘిస్తే ఒక్కరి నుంచే 406 మందికి కరోనా!