ETV Bharat / city

ఇంటర్‌ ఫలితాలు విడుదల.. ఆసిఫాబాద్ అగ్రస్థానం

minister sabitha indra reddy release telangana inter results
ఇంటర్‌ ఫలితాలు విడుదల.. ఆసిఫాబాద్ అగ్రస్థానం
author img

By

Published : Jun 18, 2020, 3:09 PM IST

Updated : Jun 18, 2020, 4:24 PM IST

14:59 June 18

ఇంటర్‌ ఫలితాలు విడుదల.. ఆసిఫాబాద్ అగ్రస్థానం

 ఇంటర్మీడియట్​ మొదటి, రెండో సంవత్సర ఫలితాలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంటర్​ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 68.86శాతం, మొదటి సంవత్సరంలో 60.01శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కొమురం భీం ఆసిఫాబాద్​, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలు మొదటి, రెండు స్థానాల్లో నిలిచాయి. అభ్యంతరాలపై ఆన్​లైన్​లో ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించారు. రీవెరిఫికేషన్, రీవాల్యుయేషన్​ సదుపాయం కల్పించనున్నట్టు ఇంటర్​ బోర్డు వెల్లడించింది.

ఇంటర్​ ద్వితీయ సంవత్సరంలో 2,83,462 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 68.86 శాతం పాసవ్వగా... బాలికలు 75.15శాతం, బాలురు 62.10శాతం  ఉత్తీర్ణులయ్యారు.1,67,942 మంది ఏ-గ్రేడ్,  80,096 మంది బీ-గ్రేడ్, 27,423 మంది సీ-గ్రేడ్, 8,001 మంది డీ-గ్రేడ్ పొందారు.

ప్రథమ సంవత్సరంలో 2,88,388 మంది విద్యార్థులు ఉత్తీర్ణులవ్వగా... 60.01శాతం నమోదు చేసుకుంది. 67.47 శాతం మంది బాలికలు, 52.30శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరంలో 1,64,245 మంది ఏ-గ్రేడ్, 78,610 మంది బీ-గ్రేడ్, 31,962మంది సీ-గ్రేడ్‌, 13,566 మంది డీ-గ్రేడ్ పొందారు.

ఫలితాల కోసం క్లిక్​ చేయండి:

లింక్​1

లింక్2

లింక్3

Last Updated : Jun 18, 2020, 4:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.