Sabitha clarity on schools close:రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో ఇటీవల కొందరు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. అదీ కాకా.. ఇప్పుడు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వస్తుందన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలు, కాలేజీలు మూసేసే అవకాశం ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తన దృష్టికి వచ్చిన ఈ విషయంపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టత ఇచ్చారు.
Schools Continue in telangana: కొవిడ్ తీవ్రత కారణంగా విద్యా సంస్థలు మూసివేయాలని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి తోసిపుచ్చారు. పాఠశాలలు మూసేందుకు యోచిస్తున్నట్టు వస్తున్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని సబిత స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ విద్యాసంస్థలను కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్టు మంత్రి పేర్కొన్నారు.
covid precautions in schools: విద్యాసంస్థలపై తప్పుడు ప్రచారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మవద్దని సబిత కోరారు. కరోనా వ్యాప్తి కట్టడికి పాఠశాలలు, కళాశాలల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. విద్యాసంస్థల్లోనూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని యాజమాన్యాలకు మంత్రి సూచించారు. ఇలాంటి అసత్య వార్తలను వ్యాప్తి చేసి.. ప్రజలను ఆందోళనలో పడేయొద్దని నెటిజన్లను కోరారు. ప్రజలు భయభ్రాంతలకు గురిచేసే.. అసత్య వార్తలను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: