ETV Bharat / city

' నా భర్త చదివిన పాఠశాల వద్ద ఓ ఫొటో తీయండి' - minister sabitha Indra reddy

పాఠశాలలు పునఃప్రారంభమైన దృష్ట్యా యాజమాన్యాలు తీసుకున్న చర్యలను పరిశీలించేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్​లోని శివరాంపల్లి పాఠశాలను సందర్శించారు. తన భర్త, దివంగత మాజీ మంత్రి ఇంద్రారెడ్డి అదే పాఠశాలలో చదువుకున్న విషయాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు.

Minister Sabita Indrareddy visits Shivarampally school
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
author img

By

Published : Feb 2, 2021, 9:21 AM IST

Updated : Feb 2, 2021, 9:28 AM IST

తెలంగాణలో పాఠశాలలు పునఃప్రారంభమైన దృష్ట్యా యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. విద్యార్థులు మాస్కులు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

హైదరాబాద్ శివరాంపల్లి జిల్లా పరిషత్​ పాఠశాలను సందర్శించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. శానిటేషన్, కరోనా నిబంధనలు పాటిస్తున్నారో లేదో పరిశీలించారు. తన భర్త, దివంగత మాజీ మంత్రి ఇంద్రారెడ్డి అదే పాఠశాలలో చదివిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.

ఆ పాఠశాలలో పాత భవనాన్ని కూల్చివేయాలని మంత్రి విద్యాధికారులను ఆదేశించారు. అదే భవనంలో ఇంద్రారెడ్డి చదువుకున్నారని ఓ నాయకుడు మంత్రి దృష్టికి తేవడంతో ఆమె ఆ భవనం దగ్గరకు వెళ్లారు. నా భర్త చదివిన పాఠశాల ముందు ఒక ఫొటో తీయండి అని అధికారులను అడిగారు. ఈ ఫొటోను తన మనవలకు చూపించి వారి తాత చదివిన పాఠశాల గురించి వివరిస్తానని చెప్పారు.

Last Updated : Feb 2, 2021, 9:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.