ETV Bharat / city

దశలవారీగా నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి: సబితా ఇంద్రారెడ్డి - మంత్రి సబితా ఇంద్రారెడ్డి తాజా వార్తలు

Sabitha Indra Reddy: రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. దశలవారీగా నియోజకవర్గంలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామాలను అభివృద్ధి పరుస్తూ ముందుకు సాగుతామని మంత్రి అన్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో స్థానిక భాజపా నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు.

Sabitha Indra Reddy
Sabitha Indra Reddy
author img

By

Published : Mar 24, 2022, 5:17 PM IST

Sabitha Indra Reddy: రంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. దశలవారీగా నియోజకవర్గంలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామాలను అభివృద్ధి పరుస్తూ ముందుకు సాగుతామని మంత్రి అన్నారు. ఆయా పట్టణాలలో నాలాలతో పాటు తాగునీటి అవసరాలు తీర్చడానికి సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు విడుదల చేశారని మంత్రి పేర్కొన్నారు.

అందులో భాగంగానే తుక్కుగూడ మున్సిపాలిటీ మంకల్ కమాన్ నుంచి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వరకు రహదారి వెడల్పునకు రూ.50 లక్షలతో చేపట్టనున్న పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. రావిర్యాలలో రూ.20 లక్షలతో నిర్మించనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్డు పనులకు, కోటి రూపాయలతో కడుతున్న వైకుంఠధామం నిర్మాణానికి మంత్రి అంకురార్పణ చేశారు.

అనంతరం కందుకూరులోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను నేరుగా కలిసి సమస్యలను తెలుసుకున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో స్థానికంగా ఉన్న భాజపా నేతలను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కొందరు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అరెస్టు చేసి మహేశ్వరం పోలీసుస్టేషన్​కి తరలించారు.

ఇదీ చదవండి:TRS Ministers Protest at Begumpet : 'మోదీ సర్కార్‌ను గద్దె దించే వరకు విశ్రమించం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.