ETV Bharat / city

నియోజకవర్గానికో గ్రంథాలయం నిర్మిస్తాం: మంత్రి సబిత

author img

By

Published : Jul 1, 2020, 10:43 PM IST

రంగారెడ్డి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో అత్యాధునిక గ్రంథాలయ భవనం నిర్మించనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బడంగ్​పేట్​లో ఇవాళ గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

minister sabhitha indra reddy foundation for librarry building in badangpet
నియోజకవర్గానికో గ్రంథాలయం నిర్మిస్తాం: మంత్రి సబిత

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్​పేట్​లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి... నూతన గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో అత్యాధునిక గ్రంథాలయ భవనం నిర్మించాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్​ అత్యాధునిక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారని... అదే స్ఫూర్తితో రూ.4 కోట్లు వెచ్చించి, అన్ని హంగులతో నిర్మిచినట్టు తెలిపారు. జ్ఞానం పెంపొందించే విధంగా, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి అందుబాటులో ఉండేలా గ్రంథాలయం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్​ రెడ్డి, రంగారెడ్డి జడ్పీ ఛైర్మన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, అధికారులు, ప్రజాప్రతినిధిలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కరోనాకు భారత్ వ్యాక్సిన్.. అంతర్జాతీయ ప్రమాణాలతో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.