ETV Bharat / city

మంత్రి రోజా ఫోన్​ మిస్సింగ్​.. మూడు బృందాల గాలింపు.. ఎట్టకేలకు..! - మంత్రి రోజా ఫోన్​ చోరీ వార్తలు

Minister RK Roja phone missing: ఏపీ మంత్రి రోజా ఫోన్​ చోరీకి గురైంది. రంగంలోకి దిగిన పోలీసులు.. మూడు బృందాల ద్వారా ఫోన్ కోసం గాలించారు.​ ట్రాకింగ్​ను ఉపయోగించి ఎట్టకేలకు ఫోన్​ను కనిపెట్టారు.​ చోరీ చేసింది ఎవరో తెలిసి షాకయ్యారు.

మంత్రి రోజా ఫోన్​ మిస్సింగ్​.. మూడు బృందాల గాలింపు.. ఎట్టకేలకు..!

author img

By

Published : Apr 21, 2022, 3:01 PM IST

Minister RK Roja phone missing: ఏపీ పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్​.కె. రోజా ఫోన్‌ చోరీకి గురైంది. తిరుపతి ఎస్వీయూ సెనెట్‌ హాల్​లో రాష్ట్ర స్థాయి శాప్​ అధికారులతో సమీక్ష నిర్వహించిన రోజా.. అంతకుముందు ఎస్వీయూ ఆవరణలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. స్వామివారిని దర్శించుకునే సమయంలో రోజా ఫోన్‌ చోరీకి గురైంది. విషయం తెలుసుకున్న పోలీసులు.. ట్రాకింగ్​ ద్వారా మంత్రి ఫోన్​ ఆచూకీ కోసం మూడు బృందాల ద్వారా గాలింపు చేపట్టారు.

చోరీకి గురైన మంత్రి ఫోన్‌ ఎస్వీయూలోని ఓ ఒప్పంద ఉద్యోగి వద్ద ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకుని రోజా ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఫోన్​ను మంత్రికి అప్పగించారు. ఏకంగా మంత్రి సెల్​ఫోన్​నే చోరీ చేసిన ఒప్పంద ఉద్యోగిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి..

ACB Raids: జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారి ఇంట్లో అనిశా సోదాలు

పెళ్లికి డబ్బులు లేవని కూతురినే చంపిన తండ్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.