అంబేడ్కర్ చూపిన బాటలో బడుగు బలహీనవర్గాల ఉన్నతి కోసం పనిచేయడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. భారతరత్న బీఆర్ అంబేడ్కర్ 129వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి నివాళులు అర్పించారు. లాక్డౌన్ కారణంగా అధికారిక నివాసంలోనే కార్యక్రమం నిర్వహించారు. అంబేడ్కర్ చూపిన బాటను స్ఫూర్తిగా తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ సాగుతున్నారని ప్రశాంత్ రెడ్డి అన్నారు.
ఇవీచూడండి: కేసీఆర్ అంబేడ్కర్ ధోరణినే అవలంభిస్తున్నారు: ఎర్రబెల్లి