ETV Bharat / city

సచివాలయ నిర్మాణం సకాలంలో పూర్తిచేయాలి: ప్రశాంత్​రెడ్డి - తెలంగాణ తాజా వార్తలు

అనుకున్న సమయానికే సచివాలయ నిర్మాణం పూర్తికావాలని మంత్రి ప్రశాంత్​రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. సచివాలయం, కొత్త కలెక్టరేట్ల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించిన మంత్రి... పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు.

prasanth
సచివాలయ నిర్మాణం సకాలంలో పూర్తిచేయాలి: ప్రశాంత్​రెడ్డి
author img

By

Published : Jan 28, 2021, 10:06 PM IST

Updated : Jan 28, 2021, 10:49 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సచివాలయం.. అనుకున్న సమయానికి పూర్తి కావాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారులు, ఇంజినీర్లు, గుత్తేదార్లు, ఆర్కిటెక్టులతో మంత్రి సమావేశమయ్యారు. సచివాలయం, సమీకృత కలెక్టరేట్లు, అమరువీరుల స్మారకం పనుల పురోగతిపై సమీక్షించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రతి ఆలోచన ప్రజల అభివృద్ధి కోణంలోనే ఉంటుందన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఎన్నో గంటల మేథోమధనం తర్వాతే ఆయన నిర్ణయాలు ఉంటాయని ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

సచివాలయ నిర్మాణానికి అవసరమయ్యే సామగ్రిని నెలలోపు ఖరారు చేసుకుని.. సమకూర్చుకోవాలని సూచించారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి నెలలోపు ఐదు దశల్లో సామగ్రిని ఖరారు చేయాలని నిర్ణయించారు. పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఆర్ అండ్ బీ అధికారులు, గుత్తేదారులు, ఆర్కిటెక్ట్​లతో అంతర్గత కమిటీని ఏర్పాటు చేశారు. పనిలో జాప్యం జరగకుండా, పూర్తి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని ప్రశాంత్ రెడ్డి సూచించారు.

వీలైతే దిల్లీ వెళ్లి..

ప్రధాన ద్వారం, ప్రహరీగోడ గ్రిల్స్​కు సంబంధించిన తుది నమూనాను వారం రోజుల్లో అందించాలని ఆర్కిటెక్ట్ ఆస్కార్​ను ఆదేశించారు. ఫౌంటైన్ నిర్మాణం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల్లోని నమూనాలను పరిశీలించాలని, వీలైతే దిల్లీ వెళ్లి అక్కడి ఫౌంటైన్​ను పరిశీలించి రావాలని మంత్రి సూచించారు.

అమరవీరుల త్యాగాన్ని చాటి చెప్పేలా..

ఇప్పటికే నిర్మాణం పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కలెక్టరేట్లలో ఫర్నీచర్​ను త్వరగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భూపాలపల్లి, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ కలెక్టరేట్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని తెలిపారు. తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని చాటి చెప్పేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో నిర్మిస్తున్న అమరవీరుల స్మారకం వీలైనంత త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఇవీచూడండి: కొత్త సచివాలయ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి: సీఎం కేసీఆర్

Last Updated : Jan 28, 2021, 10:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.