ఏపీకి కొత్త పరిశ్రమలు తీసుకురావడమే కాక.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రం నుంచి అమర్ రాజా బ్యాటరీస్ సంస్థ వెళ్లిపోవాలని తమ ప్రభుత్వం కోరుకోవటం లేదని చెప్పారు.
అవసరమయితే అక్కడకు సమీపంలోనే వారు కొనుగోలు చేసిన 4 వేల ఎకరాల్లో పరిశ్రమను స్థాపించుకోవచ్చని సలహా ఇచ్చారు. ప్రతీ పదేళ్లకు బ్యాటరీ తయారీ కంపెనీలు తమ యూనిట్‌లను రీ-లొకేట్ చేయాల్సి ఉంటుందని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. లాభాల కోసమే అమర్ రాజా కంపెనీ ఇతర రాష్ట్రాలకు వెళ్లాలని భావిస్తోందని వ్యాఖ్యానించారు.
ఇవీచూడండి: Devineni Uma: రాజమహేంద్రవరం జైలు నుంచి దేవినేని ఉమ విడుదల