కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పాత్రికేయుడి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంకితభావంతో వార్తలు అందించే జర్నలిస్టులే వార్తగా మారడం దురదృష్టమన్నారు. డాక్టర్లు, పోలీసులు, జర్నలిస్ట్లు కరోనా బారిన పడి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని.. ఇప్పటికైనా ప్రజలు వాస్తవాలను గమనించి కరోనాపై స్వీయ రక్షణ చర్యలు పాటించాలని కోరారు.
కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్న డాక్టర్లు, పోలీసులు మున్సిపల్ సిబ్బంది, జర్నలిస్టులు అత్యవసర విధులు నిర్వహిస్తూనే స్వీయ రక్షణ చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. వార్తా సేకరణలో జర్నలిస్టులు జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానం ఉంటే వెంటనే టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి: కరోనా ప్రభావం, లాక్డౌన్ అమలుపై రేపు కేసీఆర్ సమీక్ష