మారుమూల ప్రాంతాల్లో ఉన్న రైతులకు సైతం సలహాలు, సూచనలు అందించి వ్యవసాయంలో ఒక చైతన్యం తీసుకురావాలన్న ఉద్దేశంతో రైతువేదికలు నిర్మిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2604 రైతు వేదికలను త్వరలోనే సామూహికంగా ప్రారంభించనున్నట్లు మంత్రి ప్రకటించారు.
వ్యవసాయంలో రైతులకు అన్ని విషయాల్లో సమగ్ర శిక్షణ ఇచ్చేందుకు వ్యవసాయశాఖ పూర్తి కసరత్తు చేస్తోందని మంత్రి తెలిపారు. రైతు కమిటీలను సంఘటితం చేసి... వ్యవసాయంలో ఆధునికత, సాంకేతికతను జోడించి ఈ కేంద్రాల ద్వారా రోజువారిగా సలహాలు, సూచనలు అందించనున్నట్లు వివరించారు. మారుమూల గ్రామంలోని రైతులు నేరుగా సీఎం కేసీఆర్‌తో మాట్లాడే అవకాశం కూడా ఈ వేదికల్లో కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు.