తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ... రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఖండించారు. తెలంగాణ ఉద్యమంపై మోదీ చట్టసభలో బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం విచారకరమన్నారు. తెలంగాణ బిల్లుపై ఉభయసభల్లో చర్చ జరిగిందని గుర్తుచేశారు. 2014 ఫిబ్రవరి 7న కేంద్రమంత్రుల బృందం నివేదికను కేంద్ర మంత్రిమండలి ఆమోదించిందని వివరించారు.
చర్చలు లేకుండా తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారనడం అమరవీరుల బలిదానాలను అవమానించడమేనని ఆక్షేపించారు. సుధీర్ఘ పోరాటాల ఫలితంగా ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో 2001లో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం 2009లో కేసీఆర్ ప్రాణత్యాగానికి సిద్ధమవడం వల్ల కేంద్ర ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు. తప్పని పరిస్థితుల్లో జాతీయపార్టీలు తెలంగాణకు మద్దతివ్వగా... కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిందన్నారు.
ఇవీ చూడండి : నేరకథా చిత్రమ్: చేపల వ్యాపారి హత్య వెనుక విస్తుపోయే ప్రణాళిక!