ETV Bharat / city

'ఎన్నికల తర్వాత ప్రతి ఒక్కరికి వరదసాయం అందిస్తాం' - మంత్రి నిరంజన్​రెడ్డి తాజా వార్తలు

తెలంగాణ కోసం ఏమి చేయనోళ్లు ఎగిరెగిరి మాట్లాడుతున్నారని మంత్రి నిరంజన్​రెడ్డి విమర్శించారు. అంబర్​పేట నియోజకవర్గంలోని పలు డివిజన్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. ఉద్యమంలో అమరులైన వారికి ఒక్కనాడు కూడా విపక్ష పార్టీల నేతలు నిండు మనసుతో నివాళులు అర్పించలేదన్నారు. ఇలాంటివారు ఇప్పుడు అవకాశం ఇస్తే ఏదో చేస్తామని అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు.

'ఎన్నికల తర్వాత ప్రతి ఒక్కరికి వరదసాయం అందిస్తాం'

author img

By

Published : Nov 23, 2020, 10:07 PM IST

హైదరాబాద్ తెలంగాణకు గుండె లాంటిదని మంత్రి నిరంజన్​రెడ్డి అన్నారు. దేశంలోనే హైదరాబాద్​ని రోల్ మోడల్​గా నిలబెట్టింది తెరాస ప్రభుత్వమేనని వెల్లడించారు. అంబర్​పేట్​లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి ఆరేళ్లలో కేసీఆర్​ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు.

దేశంలోని మహానగరాలకు, రాష్ట్రాలకు హైదరాబాద్ జంక్షన్ లాంటిది. దేశ అభివృద్ధికి తోడ్పాటులో హైదరాబాద్ పాత్ర కీలకం. తెలంగాణ కోసం ఏమి చేయనోళ్లు ఎగిరెగిరి మాట్లాడుతున్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం పట్టుమని 10 పైసలు ఇయ్యలేదు. తెలంగాణ కోసం బరిగీసి నిలబడినప్పుడు నాటి భాజపా ఎమ్మెల్యే కిషన్ రెడ్డి రాజీనామా చేయకుండా తప్పించుకున్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ విగ్రహానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి ఏనాడు దండేసి దండం పెట్టింది లేదు. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరులకు ఒక్కనాడు కూడా ఈ విపక్ష పార్టీల నేతలు నిండు మనసుతో నివాళులు అర్పించలేదు. ఇలాంటివారు ఇప్పుడు అవకాశం ఇస్తే ఏదో చేస్తామని అబద్దాలు చెబుతున్నారు. - నిరంజన్​రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి.

ఆరేళ్లలో ఆరోగ్య తెలంగాణ నిర్మాణం కోసం ఎన్నో ప్రణాళికలు, నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి నిరంజన్​రెడ్డి వివరించారు. కోటికి పైగా జనం ఉన్న నగరంలో నిరంతర విద్యుత్​ సరఫరా చేస్తున్నామని పునరుద్ఘాటించారు. ఐటీలో నంబర్ వన్​గా, నిర్మాణ రంగంలో అగ్రస్థానంలో నిలబడ్డామని గుర్తు చేశారు. కరోనా వచ్చినా, వరదలు వచ్చినా హైదరాబాద్​లో గల్లీ గల్లీ తిరిగింది తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, నేతలు మాత్రమేనని చెప్పుకొచ్చారు. నిలిపేసిన వరదసాయాన్ని డిసెంబరు 4 తర్వాత ప్రతి ఒక్కరికి అందిస్తామని హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి: గ్రేటర్​ బస్తీలో ప్రచారం ముమ్మరం... పోటీ రసవత్తరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.