రోగులకు వీఐపీల తరహాలో చికిత్స అందించిన నాడే తీసుకుంటున్న జీతానికి న్యాయం చేసిన వారవుతారని ఈఎస్ఐ అధికారులను ఉద్దేశించి మంత్రి మల్లా రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతినెలా కోట్ల రూపాయల ఇండెంట్లు పంపుతున్నా... ఇప్పటికీ ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో మందుల కొరత ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈఎస్ఐ అధికారులతో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ క్యాంపస్లో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఇకపై ప్రతినెలా రోగులకు అందించిన మందుల వివరాలను ఆన్లైన్ లో ఉంచాలని ఆదేశించారు. అన్ని ఈఎస్ఐ ఆస్పత్రుల్లో తగిన సిబ్బందిని నియమించాలన్నారు. ఎలాంటి తప్పులు దొర్లకుండా ఈఎస్ఐలో సేవలు అందించాలని అధికారులకు స్పష్టం చేశారు.