సికింద్రాబాద్ కంటోన్మెంట్(Secunderabad Cantonment)ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC)లో విలీనం చేయాలన్న వాదనతో తాను ఏకీభవిస్తున్నట్లు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ (MINISTER KTR) తెలిపారు. ట్విటర్ వేదికగా ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు.
కంటోన్మెంట్‌ను (Secunderabad Cantonment) జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. తాను కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నానన్న కేటీఆర్... మిగతా వారు ఏమంటారని ప్రజలను ప్రశ్నిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
జీహెచ్‌ఎంసీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనం కోరుతున్నారు. కంటోన్మెంట్ విలీనం చేయాలని కొంతమంది కోరుతున్నారు. విలీనం వాదనతో నేనూ ఏకీభవిస్తున్నా. విలీనంపై మీరేమంటారు?
- కేటీ రామారావు, పురపాలక శాఖ మంత్రి
కేటీఆర్ ట్వీట్ (KTR tweet) తో నెటిజన్లు స్పందిస్తున్నారు. జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంట్ విలీనం సరైందేనని చాలా మంది రిప్లై ఇచ్చారు. కొంత మంది ఇది సాధ్యం కాదని చెబుతున్నారు.
ఇవీ చూడండి: