ETV Bharat / city

హైదరాబాద్‌కు హెరిటేజ్ గుర్తింపు వచ్చేలా కృషిచేస్తా: కేటీఆర్​ - hyderabad as heritage city

హైదరాబాద్‌కు హెరిటేజ్ గుర్తింపు వచ్చేలా ప్రయత్నం చేస్తామని కేటీఆర్​ స్పష్టం చేశారు. మంత్రులు, ఎంపీలతో కలిసి పునరుద్ధరించిన మొజంజాహి మార్కెట్‌ను ఆయన ప్రారంభించారు. ఆ మార్కెట్​తో తనకున్న చిన్ననాటి జ్ఞాపకాలను కేటీఆర్​ గుర్తుచేసుకున్నారు.

KTR ABOUT MJ MARKET OPENING
హైదరాబాద్‌కు హెరిటేజ్ గుర్తింపు వచ్చేలా ప్రయత్నం చేస్తా: కేటీఆర్​
author img

By

Published : Aug 14, 2020, 7:09 PM IST

Updated : Aug 14, 2020, 7:27 PM IST

హైదరాబాద్‌కు హెరిటేజ్ గుర్తింపు వచ్చేలా కృషిచేస్తా: కేటీఆర్​

హైదరాబాద్‌కు హెరిటేజ్ గుర్తింపు వచ్చేలా ప్రయత్నం చేస్తామని కేటీఆర్​ స్పష్టం చేశారు. రూ.15 కోట్లతో పునరుద్ధరించిన మొజంజాహి మార్కెట్‌ను.. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్​యాదవ్​, శ్రీనివాస్ గౌడ్, సబిత, ఎంపీలు కేశవరావు, అసదుద్దీన్ ఒవైసీ, మేయర్​ మేయర్ రామ్మోహన్​లతో కలిసి కేటీఆర్ పునఃప్రారంభించారు.

రెండేళ్ల క్రితం మొజంజాహి మార్కెట్‌ను చూస్తే బాధ కలిగేదని మంత్రి కేటీఆర్​ అన్నారు. 1933 తర్వాత మార్కెట్‌ పునరుద్ధరణ పనులు జరగలేదని తెలిపారు. మార్కెట్‌ పునరుద్ధరణ పనులను మున్సిపల్‌శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి అర్వింద్‌ స్వయంగా పర్యవేక్షించారని.. ఈ ప్రాజెక్టును దత్తత తీసుకున్నారని కేటీఆర్​ పేర్కొన్నారు.

చిన్ననాటి జ్ఞాపకాలు..

మొజంజాహి మార్కెట్‌ దగ్గర ఉన్న మయూరి హోటల్​లో కేసీఆర్​ చాలా రోజులు ఉన్నారని కేటీఆర్​ తెలిపారు. చిన్నప్పుడు ఫేమస్ ఐస్​క్రీమ్​ కోసం ఈ మార్కెట్​కు వచ్చే వాడినని కేటీఆర్​ గుర్తు చేసుకున్నారు.

హైదరాబాద్‌ నగరానికి ప్రత్యేక చరిత్ర ఉందని కేటీఆర్​ అన్నారు. హైదరాబాద్‌.. అన్ని రాష్ట్రాలు, సంస్కృతుల సమ్మేళనమని కేటీఆర్​ స్పష్టం చేశారు. కుల, మతాలతో సంబంధం లేకుండా భాగ్యనగరంలోని చారిత్రక సంపదను పరిరక్షిస్తామని కేటీఆర్​ వెల్లడించారు.

ఇవీచూడండి: కరోనా కాలంలో సరికొత్తగా పంద్రాగస్టు వేడుకలు

Last Updated : Aug 14, 2020, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.