ETV Bharat / city

'అక్టోబర్​లోగా కాళేశ్వరం తొమ్మిదో ప్యాకేజీ పనులు పూర్తిచేయండి' - కాళేశ్వరం ప్యాకేజీ-9 పనులు

కాళేశ్వరం ప్రాజెక్టు తొమ్మిదో ప్యాకేజీ పనుల ప్రగతిపై కేటీఆర్‌ సమీక్ష

author img

By

Published : Jul 3, 2020, 7:02 PM IST

Updated : Jul 3, 2020, 8:24 PM IST

18:59 July 03

'అక్టోబర్​లోగా కాళేశ్వరం తొమ్మిదో ప్యాకేజీ పనులు పూర్తిచేయండి'

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపడుతున్న తొమ్మిదో ప్యాకేజీ పనులను అక్టోబర్​లోగా పూర్తిచేయాలని ఇంజనీర్లు, అధికారులను.. మంత్రి కేటీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ ప్రగతిభవన్​లో తొమ్మిదో ప్యాకేజీ పనులపై నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్, సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ వెంకటేశ్వర్లు, ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, ఇతర అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పనుల ప్రగతిపై ఆరా తీశారు.  

తొమ్మిదో ప్యాకేజీకి సంబంధించిన 12 కిమీ మేర సొరంగం, సిమెంట్ లైనింగ్, పంప్ హౌజ్​, సర్జ్​పూల్ పనులు వేగంగా జరిగేలా.. క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయి అధికారులు, గుత్తేదారులతో సమీక్షించి పనులు వేగంగా జరిగేలా చూడాలని సూచించారు.  

         అక్టోబర్ నెలాఖరు నాటికి మధ్యమానేరు జలాశయం నుంచి ఎగువ మానేరు జలాశయాన్ని.. గోదావరి జలాలతో నింపుతామని అధికారులు కేటీఆర్​కు వివరించారు. అప్పటిలోగా తొమ్మిదో ప్యాకేజీకి సంబంధించిన ప్రధాన, డిస్ట్రిబ్యూషన్ కాలువల భూసేకరణ, నిర్మాణ పనులు పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. తద్వారా అక్టోబర్​లో తొమ్మిదో ప్యాకేజీ ద్వారా 30 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీటిని అందించే వీలు కలుగుతుందని మంత్రి వివరించారు. సిరిసిల్ల జిల్లాలోని 666 చెరువులను కాళేశ్వరం జలాల ద్వారా నింపేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.  

ఇవీచూడండి:   పుడ్ ​ప్రాసెసింగ్​ సెజ్​ల ఏర్పాటుకు నాబార్డుకు కేటీఆర్​ ప్రతిపాదన

Last Updated : Jul 3, 2020, 8:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.