బాధిత మహిళల తరఫున అండగా నిలబడే.. రాష్ట్ర మహిళా కమిషన్‌ను త్వరలోనే పునరుత్తేజ పరుస్తామని ఐటీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రెండేళ్లుగా రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఛైర్ పర్సన్ లేకుండా ఖాళీగా ఉండటం సరైన సంప్రదాయం కాదని సోషల్ ఆక్టివిస్ట్ సునితా క్రిష్ణన్ ట్విట్టర్ వేదికగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్, తెలంగాణ సీఎంవోను ఆమె ట్యాగ్ చేశారు.
పార్టీలో అందుకు తగిన మహిళలు ఎవరూ లేరని భావిస్తే.. పార్టీలతో సంబంధంలేని మహిళాశక్తిని ఆ స్థానంతో భర్తీ చేయాలని ఆమె సూచించారు. బాధిత మహిళలకు చట్టబద్ధంగా అండగా నిలబడేందుకు ఇది ప్రాధాన్య అంశంగా చూడాలని ఆమె కోరారు. ఇందుకు మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే రాష్ట్ర మహిళా కమిషన్‌కు పూర్తి స్థాయిలో మహిళా ఛైర్ పర్సన్‌ను నియమిస్తామని హామీ ఇచ్చారు.