ETV Bharat / city

పుడ్ ​ప్రాసెసింగ్​ సెజ్​ల ఏర్పాటుకు నాబార్డుకు కేటీఆర్​ ప్రతిపాదన

రాష్ట్రంలో నాబార్డు ద్వారా పుడ్​ ప్రాసెసింగ్​ సెజ్​లు ఏర్పాటు చేయాలని నాబార్డు సీజీఎంను మంత్రి కేటీఆర్​ కోరారు. రైతుబంధు కమిటీల ద్వారా వ్యవసాయ రంగానికి రుణాలు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించాలని నాబార్డుకు మంత్రి కేటీఆర్​ ప్రతిపాదించారు.

ktr nabard meeting
పుడ్​ప్రొసెసింగ్​ సెజ్​లు ఏర్పాటుచేయండి.. నాబార్డుకు కేటీఆర్​ ప్రతిపాదన
author img

By

Published : Jul 3, 2020, 6:42 PM IST

రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్​లు ఏర్పాటుకు కార్యచరణ చేపట్టాలని నాబార్డును పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ప్రగతిభవన్​లో మంత్రి కేటీఆర్​తో నాబార్డు సీజీఎం వైకేరావు భేటీ అయ్యారు.

రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండేందుకు నాబార్డుకు ఉన్న అవకాశాలను.. కేటీఆర్ ఈ సమావేశంలో వివరించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులోకి వస్తున్న సాగునీటి ద్వారా వ్యవసాయోత్పత్తుల విప్లవం వస్తుందన్నారు. దీనితో ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు అవకాశం ఉందని కేటీఆర్​ నాబార్డు అధికారులకు వివరించారు. సెజ్​ల ఏర్పాటుకు నాబార్డు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కోరారు.

ఫైబర్ గ్రిడ్..

తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సదుపాయాల ఏర్పాటుకు వీలు కలుగుతుందన్నారని కేటీఆర్​ అన్నారు. తద్వారా వ్యవసాయ రంగంలో అద్భుతమైన మార్పులు వచ్చే అవకాశం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ ప్రాతిపదికపై ఫైబర్ గ్రిడ్​కు రుణసాయం అందించే అంశాన్ని పరిశీలించాలని నాబార్డు సీజీఎంకు విజ్ఞప్తి చేశారు.

సొంత జిల్లా సిరిసిల్లాలో..

పాడి పశువుల అభివృద్ధి కార్యక్రమం ద్వారా నాబార్డు అనేక రుణాలు ఇస్తోందని... ఏదైనా ఒక జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కేటీఆర్ కోరారు. తన సొంత జిల్లా సిరిసిల్లలో ఈ కార్యక్రమం చేపట్టేందుకు నాబార్డు ముందుకువస్తే పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. దీని ద్వారా గ్రామాల్లోని వ్యవసాయ కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని మంత్రి చెప్పారు.

రైతుబంధు కమిటీల ద్వారా..

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా సుమారు రెండు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 500 గోదాంల నిర్మాణానికి సాయం చేయాలని కోరారు. గ్రామాల్లోని రైతుబంధు కమిటీల ద్వారా వ్యవసాయరంగానికి రుణాలు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించాలని నాబార్డుకు మంత్రి కేటీఆర్​ ప్రతిపాదించారు.

సంసిద్ధత..

గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ రుణ వ్యవస్థ బలోపేతానికి నాబార్డు పూర్తిస్థాయిలో సహకారం అందించేందుకు ముందుకు వచ్చిందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధించి చేపడుతున్న అనేక కార్యక్రమాలు.. తమ లక్ష్యాలకు, స్ఫూర్తికి అనుగుణంగా ఉన్నాయని నాబార్డు సీజీఎం వైకేరావు తెలిపారు. మంత్రి కేటీఆర్ సూచనలపై సానుకూలంగా స్పందించిన ఆయన... రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.

ఇవీచూడండి: ఆన్​లైన్ క్లాసులపై దాగుడు మూతలొద్దు.. ప్రభుత్వంపై హైకోర్టు అసహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.