రాకెట్ ఇంజిన్ పైదశను విజయవంతంగా పరీక్షించిన హైదరాబాద్ ఎయిరోస్పేస్ స్టార్టప్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు. ఈ ఘనత సాధించిన స్కైరూట్ ఎయిరో స్పేస్ బృందాన్ని ప్రశంసించారు. సంస్థ సభ్యులతో కేటీఆర్ సమావేశమయ్యారు.
అప్పర్ స్టేజ్ రాకెట్ ఇంజన్‌ను విజయవంతంగా పరీక్ష చేయడం ద్వారా దేశంలో ఈ ఘనత సాధించిన తొలి ప్రైవేటు సంస్థగా స్కైరూట్ నిలిచింది. స్థానికంగా రాకెట్ ఇంజిన్ తయారీ సామర్థ్యాన్ని చూపిన స్కైరూట్ ఎయిరోస్పేస్ను కేటీఆర్ అభినందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.
