కరోనా మహమ్మారి మూడో దశ ఉద్ధృతి ముప్పు పొంచి ఉందన్న అధ్యయనాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అందుకు అనుగుణంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలి వెల్ఫేర్‌లో కొవిడ్ కమాండ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయల కల్పన, మూడో వేవ్ ఎదుర్కొనేందుకు ప్రణాళికలో భాగంగా ఈ కేంద్రాన్ని ఏర్పాట్లు చేసినట్లు కేటీఆర్ తెలిపారు.
కరోనా విజృంభణను అత్యాధునిక సాంకేతికత సాయంతో అంచనా వేయడం సహా కరోనా బాధితులకు వెంటనే సాయం అందేలా చర్యలు తీసుకొనే విధంగా కొవిడ్ కమాండ్ సెంటర్ పనిచేస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, ఐఐహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ డైరెక్టర్ వర్షిణి సహా పలువురు పాల్గొన్నారు.
ఇదీచూడండి: KTR: రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్లు