ETV Bharat / city

Ktr Review: 'కొత్త పెట్టుబడులు తెచ్చేందుకు ఇది సరైన అవకాశం'

కరోనా సంక్షోభ సమయంలోనూ తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించగలిగామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. కొవిడ్​ అనంతర పరిణామాలను తెలంగాణకు అనుకూలంగా మార్చుకోవాలని.. భారత్​లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపే సంస్థ ప్రతినిధులను రాష్ట్రానికి ఆహ్వానించాలని అధికారులకు సూచించారు.

Ktr Review
KTR
author img

By

Published : Nov 18, 2021, 7:49 PM IST

కరోనా సంక్షోభం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో.. అందివచ్చిన పెట్టుబడి అవకాశాలను... అందిపుచ్చుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని పరిశ్రమలు, ఐటీ శాఖ ఉన్నతాధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ప్రగతిభవన్‌లో పరిశ్రమలు, ఐటీ శాఖ ఉన్నతాధికారులతో కేటీఆర్ (Ktr Review)​ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కరోనా సంక్షోభం వలన అనేక రంగాల్లో కొన్ని ఇబ్బందులు, సవాళ్లు తలెత్తినా, వివిధ రంగాల్లో భారత్ లాంటి దేశాలకు అనేక నూతన అవకాశాలను కల్పించిందన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో (Ktr Review On Investments) అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ లాంటి రాష్ట్రాలకు ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవడం ఒక సాదావకాశమని మంత్రి అన్నారు.

పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు..

గత ఏడు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానాలు, సంస్కరణలతో తనదైన ఒక గుర్తింపును సాధించిందని, ఈ గుర్తింపు ద్వారానే సంక్షోభ కాలంలోనూ అనేక పెట్టుబడులను (Ktr Review On Investments)తెలంగాణకు తీసుకురాగలిగామని కేటీఆర్ అన్నారు. ప్రస్తుత కరోనా సంక్షోభ అనంతర కాలంలోనూ మరిన్ని నూతన పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేద్దామన్న కేటీఅర్, నూతన పెట్టుబడుల ద్వారా పెద్ద ఎత్తున తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందని అన్నారు.

తెలంగాణకు ఆహ్వానిద్దాం..

ఈ దిశగా భారత దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న వివిధ దేశాల కంపెనీలతో సమావేశాలను ఏర్పాటు చేయాలని, అవసరమైతే ఆయా దేశాల్లోని (Ktr Orders to IT Officials ) పారిశ్రామిక వర్గాలను తెలంగాణకు ఆహ్వానించి, ఇక్కడి పరిస్థితులను వివరించేలా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి కేటీఆర్​ సూచించారు. వచ్చే సంవత్సరంలో వివిధ పారిశ్రామిక రంగాల వారీగా పెట్టుబడులకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలని సూచించారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్​రంజన్​, వివిధ విభాగాల డైరెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదీచూడండి: KCR fires on Central Government : ' కేంద్రం భయపెడితే కేసీఆర్ భయపడతాడా..? '

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.