రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ మూగజీవాల కోసం కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించినట్లు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు. జంతు సంరక్షణా కేంద్రాలతో పాటు పునరుత్పత్తి నియంత్రణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రి చెప్పినట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు.
వరంగల్, మహబూబాబాద్‌లో ఇప్పటికే కేంద్రాలు ఏర్పాటు చేశారన్న ఆయన... సంబంధిత అధికారులను అభినందించారు. అన్ని జిల్లాల్లోనూ ఈ తరహా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను కోరారు.