KTR Foreign Tour: నాలుగు రోజుల పాటు లండన్‌లో పలు ప్రముఖ కంపెనీలతో సమావేశాలు నిర్వహించిన అనంతరం మంత్రి కేటీఆర్ ఇవాళ అక్కడి నుంచి బయలుదేరారు. లండన్ హీత్రో విమానాశ్రయం నుంచి మంత్రి కేటీఆర్ జ్యూరిక్ చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఈ రాత్రికి దావోస్‌కి చేరుకుంటారు. రేపటి నుంచి జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో పాల్గొనే ప్రపంచంలోని పలు ప్రతిష్టాత్మక కంపెనీలతో మంత్రి కేటీఆర్ సమావేశమవుతారు.
మూడు రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనామిక్ సమావేశాల్లో ప్రధాన సమావేశ మందిరంలో జరిగే పలు చర్చల్లో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. 26న స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ నగరంలో పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారు. లండన్ నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాలకు బయల్దేరిన మంత్రి బృందానికి లండన్‌లోని తెరాస ఎన్నారై శాఖ కార్యకర్తలు పెద్ద ఎత్తున వీడ్కోలు పలికారు.
ఇవీ చూడండి: