ఎవరి భవిష్యత్ కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారని ఎన్డీఏ సర్కార్‌ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. భాజపా విధానమే పెట్టుబడుల సంహరణ అని అన్నారు. ఆరేళ్లలో హైదరాబాద్‌కు భాజపా ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. భాజపాకు ఓటేస్తే జీహెచ్‌ఎంసీని డిస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారని విమర్శించారు.
ఐటీఆర్‌ను రద్దు చేసినందుకు యువత.. కరోనా కాలంలో నరకం చూసిన లక్షల మంది వలస కార్మికులు భాజపాపై ఛార్జిషీట్ వేయాలని మంత్రి కేటీఆర్ అన్నారు. రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీతో ఎవరిని ఉద్ధరించారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ జీరో అకౌంట్‌లో రూ.15 వేలు వేస్తామని చెప్పారని, ఎంతమంది ఖాతాల్లో నగదు వేశారో భాజపా నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు.