హైదరాబాద్కు చెందిన మేధా సర్వో డ్రైవ్స్ నుంచి 'హై స్పీడ్ వందే భారత్ ట్రైన్స్' రావటం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం గర్వ పడేలా చేసిన మేధా సర్వో కంపెనీకి మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
వందే భారత్ మిషన్ కింద ఫాస్టెస్ట్ ట్రైన్స్ ప్రాజెక్టులో భాగంగా 44 భోగీలను అందించే 2211 కోట్ల విలువ గల కాంట్రాక్టును హైదరాబాద్కు చెందిన మేధా సర్వో దక్కించుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా వందే భారత్ ట్రైన్ లకు కావలసిన భోగీలను కొడంకల్ ఫెసిలిటీలో తయారు చేస్తున్నారు. ఈ ట్రైన్లు మొదటి దశలో దిల్లీ- వారణాసి, దిల్లీ- కట్రా మధ్య తిరగనున్నాయి.