ETV Bharat / city

న్యూజిలాండ్‌లో 'రాజన్న సిరిపట్టు చీరలు' ఆవిష్కరణ.. కేటీఆర్ హర్షం - కేటీఆర్ టుడే ట్వీట్

KTR Tweet Today: రాజన్న సిరి పట్టు చీరలను న్యూజిలాండ్‌లో ఆవిష్కరించినందుకు మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. భారత మూలాలున్న అక్కడి మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్‌ను ట్విటర్‌ వేదికగా అభినందించారు. చేనేత కార్మికులను ప్రోత్సహించటానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని కేటీఆర్​ అన్నారు.

KTR
KTR
author img

By

Published : Sep 18, 2022, 4:05 PM IST

Updated : Sep 18, 2022, 10:32 PM IST

KTR Tweet Today: రాజన్న సిరిపట్టు బ్రాండ్‌ను మరింత విస్తృతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహకారం అందిస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక, టెక్స్‌టైల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. న్యూజిలాండ్‌లో సిరిసిల్ల పట్టుచీర రాజన్న సిరిపట్టు బ్రాండ్‌ను ఆ దేశ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్‌ అవిష్కరించారు. అక్కడ జరిగిన ఈ కార్యక్రమంలో జూమ్‌ మీటింగ్ ద్వారా పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ "సిరిసిల్ల పట్టుచీర'' ప్రాముఖ్యతపై సందేశం ఇచ్చారు. సిరిసిల్ల పట్టుచీర రాజన్న సిరిపట్టు అంతర్జాతీయ వేదికలపై అనేక మందిని ఆకర్షిస్తోందని పేర్కొన్నారు.

రాజన్న సిరిపట్టు చీరలను ప్రారంభించిన న్యూజిలాండ్ మంత్రి ప్రియాంకకు కేటీఆర్​ ధన్యవాదాలు తెలిపారు. సిరిసిల్లకు చెందిన నేతన్నల ఉత్పత్తులు ప్రపంచ వేదికలపైన ఆవిష్కారం కావడం అత్యంత సంతోషాన్ని కలిగిస్తుందని అన్నారు. ఆ దేశ మంత్రి ప్రియాంక రాధకృష్ణన్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్ఆర్ఐ, బ్రాండ్ తెలంగాణ ఫౌండర్ సునీత విజయ్ తదితరులను అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల కారణంగా ఒకప్పుడు సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల నేతన్నలు ఇప్పుడు వినూత్నమైన ఉత్పత్తులతో ప్రపంచాన్నిఆకర్షించే పరిస్థితికి చేరుకున్నారన్నారని తెలిపారు.

సిరిసిల్లకు చెందిన హరిప్రసాద్ లాంటి నైపుణ్యం కలిగిన నేతన్నలు, వినూత్నఉత్పత్తులను తయారు చేయడం పట్ల కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే హరిప్రసాద్ లాంటి నేతన్నల నైపుణ్యం వలన సిరిసిల్ల కేంద్రంగా బతుకమ్మ చీరలతో పాటు.. అగ్గిపెట్టెలో ఇమిడే చీర, వివిధ కళాకృతులు, వివిధ పేర్లతో రూపొందించిన వినూత్నమైన చీరలను నేస్తున్నారని చెప్పారు. సిరిసిల్ల రాజన్న సిరి పట్టుకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరారు. అందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం నుంచి అందిస్తామని కేటీఆర్ తెలిపారు.

  • My wholehearted compliments to New Zealand Minister @priyancanzlp Garu & Sunita Vijay Garu for launching “Rajanna Siri Pattu” Sarees in NZ

    Taking Siricilla weavers’ products global through “Brand Telangana” is a great step forward in helping talented weavers like Sri Hari Prasad https://t.co/rJHl0EVf0p

    — KTR (@KTRTRS) September 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

Last Updated : Sep 18, 2022, 10:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.