దేశ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే కేంద్రం కేటాయింపులు ఉంటున్నాయని ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ఆరోపించారు. డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ ఏర్పాటు విషయంలో కేంద్రం తీరుపై ఆయన మండిపడ్డారు.
ఏరోస్పేస్ రంగంపై శాసనమండలిలో మాట్లాడిన కేటీఆర్...... ఆ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. ఆదిభట్ల, శంషాబాద్ ఏరోస్పేస్ ఎస్ఈజెడ్లో ఎన్నో ప్రముఖ సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయన్నారు. ఈ-సిటీ ద్వారా డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ సంస్థల పెట్టుబడులనూ ఆకర్షిస్తున్నామని వివరించారు.
ఇబ్రహీంపట్నంలో 100 ఎకరాల్లో మరో కాంపోజిట్ పార్కు ఏర్పాటు చేయబోతున్నామని కేటీఆర్ తెలిపారు, ఎయిర్‌బస్‌తోనూ సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. ఇంత అభివృద్ధి జరుగుతున్నా.... కేంద్రం వివక్షను చూపెడుతోందని కేటీఆర్ విమర్శించారు.
- ఇదీ చదవండి : ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్: సీఎం కేసీఆర్