భూగర్భ మురుగు కాలువల శుద్ధీకరణకు నూతన యంత్రాలు అందుబాటులోకి రావడం శుభపరిణామని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. యాంత్రీకరణపై హైదరాబాద్లో జరిగిన ప్రాంతీయ కార్యశాలకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కాలువలను శుద్ధికరణకు యంత్రాలను వినియోగించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
యాంత్రీకరణను మొదటగా వరంగల్, సిరిసిల్లలో ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్నామని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్, కమిషనర్ శ్రీదేవి తెలిపారు. అనంతరం ఇతర పురపాలికల్లో అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. కార్యశాలలో శుద్ధీకరణ యంత్రాల తయారీ కంపెనీ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: విదేశీ ఫలాలు... ఆరోగ్యానికి సోపానాలు