ETV Bharat / city

Minister Kodali Nani: 'చంద్రబాబు, పవన్ నాటకాలు ప్రజలకు తెలుసు' - చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్

తెదేపా అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని(minister kodali nani news) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డ్రగ్స్ సరఫరాలో అఫ్గానిస్తాన్​కు తాడేపల్లికి లింకులున్నాయన్న చంద్రబాబు(Minister Kodali Nani Fires On chandrababu news) ఆరోపణలపై మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారన్న విషయం ప్రజలు గమనించారని వెల్లడించారు.

Minister Kodali Nani
మంత్రి కొడాలి నాని
author img

By

Published : Oct 10, 2021, 6:00 PM IST

మాదకద్రవ్యాల సరఫరాలో అఫ్గానిస్థాన్​కు తాడేపల్లికి నేరుగా లింకులున్నాయన్న చంద్రబాబు ఆరోపణలపై వైకాపా మండిపడింది. సీఎంకు లింకులున్నాయని చంద్రబాబుకు ఎవరు చెప్పారో స్పష్టం చేయాలని మంత్రి కొడాలి నాని(Minister Kodali Nani Fires On Chandra Babu news) డిమాండ్ చేశారు.

డ్వాక్రా సంఘాలను చంద్రబాబు నిలువునా మోసం చేశారని కొడాలి నాని (minister kodali nani news) ఆరోపించారు. ఎన్నికల నాటికి ఉన్న అప్పును 4 విడతల్లో చెల్లిస్తానని సీఎం జగన్ (cm jagan news )హామీ ఇచ్చి నిలబెట్టుకున్నారని స్పష్టం చేశారు. రెండు విడతల్లో కలిపి రూ. 13 వేల కోట్లు మహిళా సంఘాలకు చెల్లించారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలు పొందుతున్న ప్రజలను చంద్రబాబు కుక్కలతో పోల్చుతున్నారని.. ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.

జగన్ ఉన్నంత వరకు రాష్ట్రానికి సీఎంగా ఆయనే ఉంటారని నాని జోస్యం చెప్పారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్​ కలసి నాటకాలు ఆడుతున్నారన్న సంగతి ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు తన కుమారుడిపై కంటే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్(minister kodali nani fires on pawan news) పైనే నమ్మకం ఎక్కువని ఎద్దేవా చేశారు. కమ్మ సామాజికవర్గానికి అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ చెబుతున్నందున.. జనసేనలో తెదేపాను విలీనం చేస్తే మంచిదని సూచించారు. రాష్ట్ర ప్రజలు జనసేన, తెదేపాను భూస్థాపితం చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Etela Rajender at Sriramula Pally: కేసీఆర్​ కత్తి అందిస్తే.. హరీశ్​ వచ్చి పొడుస్తుండు: ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.