హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్.12లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా దైవదర్శనానికి వచ్చిన మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. స్వర్ణ దేవాలయంలో కొలువైన శ్రీరాధా గోవింద, చతుర్భుజా హనుమంతుడు, పంచజన్యేశ్వర, గరుడ దర్శనం, శక్తియోగి పీఠంను మంత్రి దర్శనం చేసుకున్నారు. హరేకృష్ణ మూవ్మెంట్ సంస్థ నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి స్వామి వారి చిత్రపటంతో పాటు తీర్థ, ప్రసాదాలను అందించారు.
ఇవీ చూడండి: యాదాద్రిలో పొటెత్తిన భక్తజనం