ETV Bharat / city

'దేశమంతటికి 157 వైద్య కళాశాలలు మంజూరు చేసి.. తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదు' - మెడికల్ సీట్ల కేటాయింపుపై హరీశ్​రావు కామెంట్స్

Harishrao on Medical Seats: కేంద్ర ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో దేశవ్యాప్తంగా 190 వరకు మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తెచ్చినా... అందులో ఒక్కటి కూడా తెలంగాణకు రాకపోవటం బాధకారమన్నారు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు కేంద్రం నిధులిస్తోందన్న భాజపా నేతల వ్యాఖ్యలను ఖండించారు. కేంద్రం నిధులు ఇస్తే ఆ వివరాలు చూపాలన్నారు.

Harishrao
Harishrao
author img

By

Published : Oct 3, 2022, 4:10 PM IST

Harishrao on Medical Seats: కేంద్ర ప్రభుత్వం వైద్య కళాశాలల విషయంలో రాష్ట్రంపై శీతకన్ను వేసినా.. రాష్ట్రప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోవటం సంతోషకరంగా ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. ఎంసీఆర్​హెచ్​ఆర్​డీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ఒక్క ఏడాదే సుమారు 8 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయని అందులో 1200 మందికి కొత్తగా ఎంబీబీఎస్ సీట్లు రానున్నట్టు స్పష్టం చేశారు. ఈ కాలేజీల కోసం ప్రభుత్వం రూ.4080 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ విభాగంలో పీజీ మెడికల్ సీట్ల సంఖ్యను 613 నుంచి 1249కి పెంచామని.. ఎంబీబీఎస్​లో ఈ ఏడాది 6500 సీట్లు భర్తీ చేయనున్నట్టు తెలిపారు.

రాబోయే రోజుల్లో ఎంబీబీఎస్ సీట్లతో పాటు పీజీ సీట్ల సంఖ్యను కూడా రెట్టింపు చేస్తామన్నారు. సీట్లు పెరిగితే మన విద్యార్థులు చైనా, రష్యా, యుక్రెయిన్, మలేషియా లాంటి దేశాలకు వెళ్లే అవసరం ఉందన్నారు హరీశ్ రావు. కాలేజీల విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి మద్దతు లేదన్నారు. గత ఏనిమిదేళ్లలో 190 కాలేజీలు కేంద్రం మంజూలు చేసినా.. వాటిలో తెలంగాణకు ఒక్కటీ రాలేదన్నారు. కేంద్రం నుంచి నిధులు అందుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. భాజపా నాయకూలకు మాటలు ఎక్కువ చేతలు తక్కువని... రాష్ట్రానికి కేంద్రం ఒక్క మెడికల్‌ కాలేజీ కూడా ఇవ్వలేదని హరీశ్‌రావు ఆరోపించారు. గవర్నర్‌ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు.

'దేశమంతటికి 157 వైద్య కళాశాలలు మంజూరు చేసి.. తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదు'

'ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే మెడికల్‌ కాలేజీలు వస్తాయని ఉద్యమ సమయంలో మాట్లాడుకున్న కల ఇప్పుడు నిజమవుతోంది. సమైక్య రాష్ట్రంలో వరంగల్, నిజామాబాద్,ఆదిలాబాద్‌లలో మూడు మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. భవిష్యత్తులో ప్రతి జిల్లాలోనూ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తాం. తెలంగాణ ఏర్పడేనాటికి 850 మెడికల్‌ సీట్లు మాత్రమే ఉండేవి. గత ఎనిమిదేళ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 2052 సీట్లు పెరిగాయి. మన విద్యార్థులు రష్యా, ఉక్రెయిన్‌, చైనాకు ఎందుకు వెళ్లాల్సి వస్తోంది? సీట్లు పెరిగితే మన విద్యార్థులు విదేశాలకు వెళ్లే అవసరముండదు. రాష్ట్రానికి కేంద్రం వైద్య కళాశాలలు మంజూరు చేయట్లేదు. దేశవ్యాప్తంగా 157 మంజూరు చేసినా తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదు'-హరీశ్​రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.