శాసనమండలిలో.. పెట్రోల్, డిజిల్ ధరల పెంపుపై గతంలో భాజపా ఎమ్మెల్సీ రాంచందర్‌రావు.. మాట్లాడిన తీరుపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధన ధరల పెంపుతో ప్రజల మీద భారం పడుతుందని పలువురు సభ్యులు లేవనెత్తిన అంశంపై.. భాజపా సభ్యుడు రాంచందర్‌రావు స్పందించారని.. రాష్ట్ర ప్రభుత్వం తన వ్యాట్‌ను తగ్గించుకోవాలని సూచించారని హరీశ్ చెప్పారు. కేంద్రం పెంచుకుంటూ పోతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం తగ్గించుకోవాలా అన్ని రాంచందర్‌రావును నిలదీశారు.
భాజపా ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఈ రోజు వరకు పెట్రోల్, డీజిల్‌పైన 18 సార్లు ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. అదే ఏడేళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం కేవలం ఒకే ఒక్కసారి సుమారు 3 శాతం పెంచింది. బాధాకరమేంటంటే.. ఎక్సైజ్ డ్యూటీని సెస్ రూపంలో పెంచుతున్నారు. అందువల్ల రాష్ట్రానికి రావాల్సిన వాటా రాకుండా పోతోంది. 2014లో పెట్రోల్‌పైన 9.2 శాతం సెస్ ఉంటే ఈరోజు 32.98 శాతానికి పెంచారు. డిజిల్పైన 3.46 శాతం నుంచి 31.83 శాతానికి పెంచారు. అంటే పదింతలు పెరిగింది. దీనిపై భాజపా నేత రాంచందర్‌రావు.. ఓ ఉచిత సలహా ఇచ్చారు. మేం పెంచుకుంటూ పోతాం.. మీరు దించుకుంటూ పోండి అంటున్నారు. అంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగొద్దా. సంక్షేమం ఉండొద్దా. తెలంగాణలో నిధులు ఉండొద్దనా మీ ఉద్దేశం. ఈ వైఖరి చారా దురదృష్టకరం.
- హరీశ్‌రావు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి
ఇవీచూడండి: మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణలోనే అద్భుతంగా..: హరీశ్‌రావు