ETV Bharat / city

వరి ధాన్యం మిల్లింగ్ వేగవంతం చేయండి: మంత్రి గంగుల - gangula kamalakar review

కరోనా వ్యాప్తి నేపథ్యంలో బియ్యం సేకరణపై పౌరసరఫరాల శాఖ అధికారులు, రైస్ మిల్లర్ల ప్రతినిధులతో మంత్రి గంగుల కమలాకర్​ సమీక్ష నిర్వహించారు. వరి ధాన్యం మిల్లింగ్ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ఆగస్టు మాసం సంబంధించి చౌక ధరల దుకాణాల వద్దకు చేరవేసిన బియ్యంపై ఆరా తీశారు. చౌక ధరల దుకాణాల వద్ద బియ్యం కొరత ఉత్పన్నం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

gangula kamalakar
gangula kamalakar
author img

By

Published : Aug 1, 2020, 8:46 PM IST

కొవిడ్-19 నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు దృష్ట్యా వరి ధాన్యం మిల్లింగ్ వేగవంతం చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని తన కార్యాలయంలో... పౌరసరఫరాల శాఖ అధికారులు, రైస్ మిల్లర్ల ప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. 2019-20 సంవత్సరంలో పౌరసరఫరాల సంస్థ ద్వారా కొనుగోలు చేసి రైస్ మిల్లర్లకు అప్పగించిన వరి ధాన్యం బదులుగా సీఎంఆర్‌... సేకరించాల్సిన బియ్యం, ప్రజా పంపిణీ ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యం, టాస్క్‌ఫోర్స్ కార్యకలాపాలపై విస్తృతంగా చర్చించారు.

2019-20 ఖరీఫ్ - వానాకాలం సీజన్ సంబంధించి రైస్ మిల్లర్ల నుంచి 31.61 లక్షల టన్నుల రా బియ్యం సేకరించాల్సి ఉండగా... 27.99 లక్షల టన్నుల బియ్యం... అంటే 89 శాతం పౌరసరఫరాల సంస్థ సేకరించింది. ఇంకా 3.62 లక్షల టన్నుల రా బియ్యం సేకరించాల్సి ఉంది. యాసంగి సంబంధించి 43.63 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్‌కు గాను 9.04 లక్షల టన్నుల బియ్యం మాత్రమే సేకరించామని... మిగతా 34.59 లక్షల టన్నుల బియ్యం సేకరణ వేగవంతం చేయాలని ఆదేశించారు.

ఈ ఏడాది ఆగస్టు మాసం సంబంధించి చౌక ధరల దుకాణాల వద్దకు చేరవేసిన బియ్యంపై ఆరా తీశారు. చౌక ధరల దుకాణాల వద్ద బియ్యం కొరత ఉత్పన్నం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో ఏమైనా లోపాలు తలెత్తితే మాత్రం సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పౌరసరఫరాల శాఖలో పనిచేస్తున్న టాస్క్‌ఫోర్స్ సిబ్బంది చేపట్టిన తనిఖీల గురించి ఆరా తీసిన మంత్రి... వివిధ సంక్షేమ పథకాల అమలుపై కూడా తనిఖీలు మమ్మురం చేయాలని ఆదేశించారు. తనిఖీల పురోగతి ఎప్పటికప్పుడు ప్రతి మాసంలో కూడా సమీక్షిస్తామని... ఎటువంటి ఉపేక్షకు తావు లేదని గంగుల స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.