కరోనా నియంత్రణలో పురోగతి కనిపిస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. నిన్న కొత్తగా 13 మందికి వైరస్ సోకిందని ప్రకటించారు. ఈ సంఖ్యతో మొత్తం వైరస్ బారిన పడిన వారి సంఖ్య 983కు చేరుకుంది. నిన్నటి వరకు కరోనా నుంచి కోలుకుని 262 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారని పేర్కొన్నారు. ఇవాళ మరో 29 మంది డిశ్చార్జ్ అవుతారని చెప్పారు. ఆస్పత్రిలో 663 మంది చికిత్సపొందుతున్నారన్నారు. ఏడుగురు వెంటిలేటర్‌పై ఉన్నారని వివరించారు.
నాలుగు ప్రాంతాల నుంచి ఎక్కువగా కరోనా కేసులు వచ్చాయి. వికారాబాద్‌లో 14 కుటుంబాల నుంచి ఎక్కువగా కరోనా కేసులు వచ్చాయి. గద్వాలలో 30 కుటుంబాల నుంచి 45 మందికి కరోనా సోకింది. సూర్యాపేటలో 25 కుటుంబాల్లో 83 మందికి కరోనా సోకింది. జీహెచ్ఎంసీలో 44 కుటుంబాల్లో 265 మందికి కరోనా సోకింది. గాంధీ ఆస్పత్రిని కోవిడ్ ఆస్పత్రిగా నామకరణం చేశారు. 10 లక్షల పీపీఈ కిట్లు, 10 లక్షల ఎన్95 మాస్కులకు ఆర్డర్ ఇచ్చాం.
-ఈటల రాజేందర్, వైద్యారోగ్య శాఖ మంత్రి
ఇదీ చూడండి: 'వేసవిలో భారత్ కరోనాను జయించొచ్చు!'